మెగాస్టార్ తో శేఖర్ కమ్ముల!

తెలుగు చిత్ర పరిశ్రమలోని ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. యాక్షన్ ఎంటర్టైనర్స్ తీయడంలో కొంతమంది తమదైన మార్క్ చూపిస్తే.. మరికొంతమంది ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో సత్తా చాటుతుంటారు. ఈకోవలో.. సెన్సిబుల్ లవ్‌స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు శేఖర్ కమ్ముల.
మరోవైపు శేఖర్ కమ్ముల చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాడు. శేఖర్ డెబ్యూ మూవీ 'డాలర్ డ్రీమ్స్' 2000వ సంవత్సరంలో విడుదలైంది. ఇక ఇండస్ట్రీలో అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆ సంబరాలను మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో జరుపుకున్నాడు శేఖర్.
టీనేజ్‌లో చిరంజీవిని తొలిసారి దగ్గర నుంచి చూసినప్పుడు ఆయనతో సినిమా తీయాలనే కోరిక కలిగిందని శేఖర్ గుర్తు చేసుకున్నారు. 'చేస్ యువర్ డ్రీమ్స్… సక్సెస్ ఫాలో అవుతుంది' అనే నమ్మకాన్ని చిరంజీవి కలిగించారన్నాడు. చిరు కొన్ని తరాలకి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి అని ప్రశంసించాడు. ఈ సందర్భంగా చిరంజీవితో దిగిన ఫోటోలను ఆయన అభిమానులతో పంచుకున్నాడు.
‘డాలర్ డ్రీమ్స్’తో తన దర్శకప్రయాణాన్ని ప్రారంభించిన శేఖర్ కమ్ముల, ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ’ వంటి విజయవంతమైన సినిమాలను అందించాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా, నాగార్జున, రష్మిక కీలక పాత్రల్లో ‘కుబేర’ చిత్రాన్ని రూపొందించాడు. జూన్ 20న ఈ చిత్రం విడుదల కానుంది.
-
Home
-
Menu