‘హరిహర వీరమల్లు’ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్!

‘హరిహర వీరమల్లు’ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ‘మాట వినాలి’ పాట అభిమానులను పెద్దగా మెప్పించలేదు. పవన్ స్వయంగా ఆలపించిన ఈ పాటపై సంగీత ప్రియుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండో పాటను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 'హరిహర వీరమల్లు' నుంచి సెకండ్ సింగిల్ రానుందట. చిరంజీవి 'విశ్వంభర'తో పాటు పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు'కి కూడా కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ తో కీరవాణికి ఇది తొలి చిత్రం.

పవన్ కళ్యాణ్ ఇంకా నాలుగైదు రోజులు సమయం ఇస్తే.. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎ.ఎమ్.రత్నం నిర్మాణంలో ఆయన తనయుడు జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్న 'హరిహర వీరమల్లు' మార్చి 28న విడుదల తేదీ ఖరారు చేసుకుంది.

Tags

Next Story