సమ్మర్ రిలీజ్ కు ‘సారంగపాణి జాతకం‘ రెడీ!

X
ప్రియదర్శి ప్రధాన పాత్రలో ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘సారంగపాణి జాతకం‘. ఈ సినిమాలో ప్రియదర్శికి జోడీగా రూప కొడువాయూర్ నటించింది. ఇతర కీలక పాత్రల్లో నరేష్, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్ కనిపించబోతున్నారు.
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అసలు క్రిస్మస్ కానుకగా రావాల్సి ఉంది. అనివార్య కారణాల వలన వాయిదా వేశారు. తాజాగా ఈ మూవీని సమ్మర్ రిలీజ్ కు రెడీ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే విడుదల తేదీపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీతో డైరెక్టర్ ఇంద్రగంటి మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తాననే నమ్మకంతో ఉన్నాడు.
Next Story
-
Home
-
Menu