సప్తగిరి ‘పెళ్లి కాని ప్రసాద్‘ అవతారం!

సప్తగిరి ‘పెళ్లి కాని ప్రసాద్‘ అవతారం!హాస్య నటుడిగా గుర్తింపు పొందిన సప్తగిరి ఈసారి పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా ‘పెళ్లి కాని ప్రసాద్‘ సినిమాతో వస్తున్నాడు. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వంలో భాను ప్రకాశ్ గౌడ్, సుక్క వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ విడుదల చేస్తుండడం విశేషం.
వెంకటేష్ సూపర్ హిట్ మూవీ ‘మల్లీశ్వరి‘లోని పెళ్లి కాని ప్రసాద్ క్యారెక్టర్ టైటిల్ ను ఈ చిత్రానికి పెట్టారు. ‘మళ్లీశ్వరి‘ తర్వాత తెలుగు లోగిళ్లలో పెళ్లికాని మగవాళ్లను పెళ్లి కాని ప్రసాద్ లు అనడం కామన్ గా మారిపోయింది. విచిత్రమేమిటంటే ఇప్పటికే ఇదే టైటిల్ తో అల్లరి నరేష్ ఒక సినిమా కూడా చేశాడు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ తోనే సప్తగిరి ‘పెళ్లి కాని ప్రసాద్‘ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తోంది.
‘పెళ్లి కాని ప్రసాద్‘ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తేనే నవ్వు తెప్పించే వినోదభరిత కంటెంట్‌కు గ్యారంటీ అనే విషయం స్పష్టమవుతోంది. ఈ సినిమాలో ప్రియాంక శర్మ కథానాయికగా నటిస్తుంది. శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
-
Home
-
Menu