ట్రెండింగ్ లో పాతికేళ్ల క్రితం సంక్రాంతి క్లాష్!

సంక్రాంతి పండుగ అంటేనే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల మధ్య క్లాష్ సాధారణం. 2025 సంక్రాంతి సీజన్‌లో మూడు ప్రధాన సినిమాలు పోటీపడ్డాయి. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' (జనవరి 10), నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' (జనవరి 12), వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' (జనవరి 14) సినిమాలు వరుసగా బాక్సాఫీస్ కి క్యూ కడుతున్నాయి. వీటిలో వెంకటేష్ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవగా.. బాలకృష్ణ 'డాకు మహారాజ్' హిట్ టాక్ తెచ్చుకుంది. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' డిజాస్టర్ గా మిగిలింది.
అయితే ఇదే తరహా క్లాష్ పాతికేళ్ల క్రితం అంటే 2000 సంక్రాంతికి జరిగింది. ఆ ఏడాది సంక్రాంతి సీజన్‌లో రామ్ చరణ్ బదులు ఆయన తండ్రి చిరంజీవి ఉన్నాడు. చిరంజీవి 'అన్నయ్య' (జనవరి 7), బాలకృష్ణ 'వంశోద్ధారకుడు', వెంకటేష్ 'కలిసుందాం రా' (రెండు జనవరి 14) విడుదలయ్యాయి. 'అన్నయ్య, వంశోద్దారకుడు' ఆడినా 'కలిసుందాం రా' సూపర్ హిట్ సాధించింది. చాలా కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకుంది. ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా తరహాలోనే పాతికేళ్ల క్రితం సంక్రాంతి బరిలో కుటుంబ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది 'కలిసుందాం రా' సినిమా.
అయితే 2001 సంక్రాంతి బరిలో సైతం చిరంజీవి 'మృగరాజు', బాలకృష్ణ 'నరసింహనాయుడు', వెంకటేష్ 'దేవీపుత్రుడు' విడుదలయ్యాయి. ఈసారి విజయం బాలయ్యది అయ్యింది. మొత్తంగా.. సంక్రాంతి అనేది టాలీవుడ్ కి ఎప్పుడూ ప్రత్యేకమే. అందుకే తమ సినిమాలను సంక్రాంతి బరిలో విడుదల చేయడానికి పోటీ పడుతుంటారు అగ్ర కథానాయకులు. ఈసారి సంక్రాంతి మాత్రం వెంకటేష్ దే.
-
Home
-
Menu