భీమవరంలో 'సంక్రాంతికి వస్తున్నాం' సంబరాలు!

భీమవరంలో సంక్రాంతికి వస్తున్నాం సంబరాలు!
X
'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్ సంబరాలను భీమవరంలో జరపబోతున్నారు. జనవరి 26 సాయంత్రం 5 గంటల నుంచి భీమవరంలో 'సంక్రాంతికి వస్తున్నాం' సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి.

వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సంబరాలు జోరుగా కొనసాగుతున్నాయి. విడుదలకు ముందే ఎన్నో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న టీమ్.. విడుదల తర్వాత కూడా అంతకు మించిన జోష్ లో పబ్లిసిటీ నిర్వహిస్తుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.230 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది.

లేటెస్ట్ గా 'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్ సంబరాలను భీమవరంలో జరపబోతున్నట్టు అధికారిక ప్రకటన విడుదల చేసింది టీమ్. జనవరి 26 సాయంత్రం 5 గంటల నుంచి భీమవరంలో 'సంక్రాంతికి వస్తున్నాం' సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి.

ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ గా అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వెంకీ కి జోడీగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Tags

Next Story