'సంక్రాంతికి వస్తున్నాం'.. సీనియర్స్ కి కొత్త బెంచ్‌మార్క్!

విక్టరీ వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా సంక్రాంతి బరిలో విడుదలై ఇప్పటికీ రికార్డుల వర్షం కురిపిస్తూనే ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ లేటెస్ట్ గా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. టాలీవుడ్ సీనియర్స్ లో ఈ ఘనతను సాధించిన ఏకైక హీరో వెంకటేష్.
మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సంపాదించుకొని, తొలి వారంలోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం. గత ఏడాది సంక్రాంతి బరిలో విడుదలైన వెంకటేష్ 'సైంధవ్' రూ.10 కోట్ల షేర్ మార్క్‌ను కూడా దాటలేకపోగా.. ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం' రూ.150 కోట్ల షేర్ మార్క్‌ను అందుకోవడం నిజంగా విశేషం.
ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ఈ సినిమాకి 3.3 మిలియన్ టిక్కెట్స్ అమ్ముడయ్యాయి. పాన్-ఇండియా సినిమాలు కాకుండా రీజనల్ మూవీస్ లో ఇదొక రేర్ రికార్డు అని బుక్ మై షో తెలియజేసింది. మరోవైపు ఇప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ కలెక్షన్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి.
-
Home
-
Menu