సంక్రాంతి కే బాలయ్య తాండవం?

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2 – తాండవం’. గతంలో వచ్చిన అఖండ సూపర్ బ్లాక్‌బస్టర్ కావడంతో సీక్వెల్‌పై హైప్ మరింత పెరిగింది.
మొదట సెప్టెంబర్ 25న విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కారణంగా వాయిదా వేశారు. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తీసుకొస్తున్నారు. ఈ చిత్రం కోసం బాలయ్య స్వయంగా హిందీ వెర్షన్‌కి డబ్బింగ్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇది బాలయ్య తీసుకున్న డేరింగ్ స్టెప్‌గా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. తమన్ సంగీతం ఈసారి మరింత మాస్ రేంజ్‌లో ఉంటుందని టాక్. అలాగే యాక్షన్ బ్లాక్స్‌ను హాలీవుడ్ స్థాయిలో డిజైన్ చేస్తున్నారట. దసరా స్లాట్ నుంచి తప్పుకున్న "అఖండ 2" రిలీజ్ డేట్‌పై ఇప్పుడు కొత్త చర్చ నడుస్తోంది.
డిసెంబర్ 5న ప్లాన్ చేసిన "రాజా సాబ్" జనవరికి మారే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఆ స్లాట్ ఖాళీ అవుతుంది కాబట్టి "అఖండ 2" డిసెంబర్ లో వస్తుందన్నారు. కానీ ఇప్పుడు బాలయ్య మూవీ కోసం సంక్రాంతి ని టార్గెట్ చేసినట్టు ఇండస్ట్రీ టాక్. అదే జరిగితే వచ్చే సంక్రాంతి సమరం బాలయ్య, చిరు, ప్రభాస్ లతో సంథింగ్ స్పెషల్ గా మారనుంది. గతంలో ఈ ముగ్గురూ 2004 సంక్రాంతి బరిలో పోటీ పడ్డారు.
ఇక 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న "అఖండ 2" చిత్రంపై నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో “జనవరి అంటే నందమూరి బాక్సాఫీస్” అంటూ ఫుల్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి, "అఖండ 2 – తాండవం" సంక్రాంతికి వస్తే, అది మాస్ ఆడియన్స్‌కి నిజమైన పండుగ కానుంది.
-
Home
-
Menu