‘ది రాజా సాబ్‘ నుంచి సంజయ్ దత్ లుక్

‘ది రాజా సాబ్‘ నుంచి సంజయ్ దత్ లుక్
X
రెబెల్ స్టార్ ప్రభాస్ నుంచి ఇమ్మీడియెట్ గా రానున్న చిత్రం ‘ది రాజా సాబ్‘. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

రెబెల్ స్టార్ ప్రభాస్ నుంచి ఇమ్మీడియెట్ గా రానున్న చిత్రం ‘ది రాజా సాబ్‘. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈరోజు సంజయ్ దత్ బర్త్ డే స్పెషల్ గా ‘ది రాజా సాబ్‘ నుంచి ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

‘ది రాజా సాబ్‘లో సంజయ్ దత్ ప్రభాస్ తాత పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం జరుగుతుంది. హారర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీలో సంజయ్ దత్ నెగటివ్ షేడ్స్ లో అలరించనున్నాడట. ‘ది రాజా సాబ్‘ నుంచి వచ్చిన సంజయ్ దత్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.



Tags

Next Story