‘గ్యాంబ్లర్‘గా సంగీత్ శోభన్

X
‘మ్యాడ్‘ సిరీస్ తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సంగీత్ శోభన్. ఇప్పుడు ఈ యంగ్ హీరో ‘గ్యాంబ్లర్స్‘ సినిమాతో వస్తున్నాడు.
‘మ్యాడ్‘ సిరీస్ తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సంగీత్ శోభన్. ఇప్పుడు ఈ యంగ్ హీరో ‘గ్యాంబ్లర్స్‘ సినిమాతో వస్తున్నాడు. థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ సినిమాలో సంగీత్ కి జోడీగా ప్రశాంతి చారులింగా నటించింది. రాకింగ్ రాకేష్, పృథ్వీరాజ్ బన్నా, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్, శివారెడ్డి కీలక పాత్రలు పోషించారు.
కేఎస్‌కే చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాని సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మించారు.. జూన్ 6న విడుదలకు ముస్తాబవుతోన్న ‘గ్యాంబ్లర్స్‘ టీజర్ రిలీజయ్యింది. ఓ దీవిలో పరిమిత సంఖ్యలోనే వ్యక్తులు పాల్గొనే క్యాసినో, పేకాట నేపథ్యంలో మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతున్నట్టు టీజర్ ను బట్టి తెలుస్తోంది.
Next Story
-
Home
-
Menu