45 రోజుల పాటు ‘టాక్సిక్’ యాక్షన్ సీన్స్!

45 రోజుల పాటు ‘టాక్సిక్’ యాక్షన్ సీన్స్!
X
‘జాన్ విక్’ చిత్రంలో స్టంట్ ప్లేయర్‌గా పనిచేసిన వ్యక్తి. ఈ సినిమాలో 45 రోజుల పాటు యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు.

“టాక్సిక్” కన్నడ సినిమా.. ఇండస్ట్రీ లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో ఒకటిగా రూపొందుతోంది. ఈ చిత్రంలో యష్ హీరోగా నటిస్తుండగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వానీ ఈ యాక్షన్ డ్రామాలో కథానాయికగా నటిస్తోంది.

ఈ సినిమా ఇప్పటికే వార్తల్లో నిలిచింది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ, గతంలో కీను రీవ్స్ నటించిన ‘జాన్ విక్’ చిత్రంలో స్టంట్ ప్లేయర్‌గా పనిచేసిన వ్యక్తి. ఈ సినిమాలో 45 రోజుల పాటు యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ షెడ్యూల్‌లో పనిచేస్తున్న అందరు స్టంట్‌మెన్ భారతీయులే. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్‌తో కలిసి పనిచేసే ఈ అద్భుతమైన అవకాశం భారతీయ బృందానికి లభించింది.

నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, మరియు అక్షయ్ ఒబెరాయ్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంకట్ కె. నారాయణ, యష్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. దాదాపు రూ. 200 కోట్లకు పైగానే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమా బహుళ భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్ వెర్షన్‌లో కూడా విడుదల కానుంది.

Tags

Next Story