దర్శన్ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్ట్

కన్నడ సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఫ్యాన్ హత్య కేసులో సుప్రీం కోర్టు తాజాగా కన్నడ స్టార్ హీరో దర్శన్‌కు మంజూరైన బెయిల్‌ను రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. దర్శన్‌తో పాటు అతని పార్టనర్ పవిత్ర గౌడ, మరో ఐదుగురు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించింది.
జస్టిస్ ఆర్. మహదేవన్, జస్టిస్ జె.బి. పర్దివాలా బెంచ్, కర్ణాటక హైకోర్టు గతంలో ఇచ్చిన బెయిల్ నిర్ణయం తప్పుదోవ పట్టిందని తేల్చింది. "ఎవరూ చట్టానికి అతీతులు కాదు" అని నొక్కి చెప్పిన కోర్టు, విచారణను వేగవంతం చేయాలని, సాక్షుల విచారణను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది.
కన్నడ సినిమా రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో దర్శన్ ఒకరు. ఆయన గతంలో బెయిల్‌పై విడుదలయ్యారు. 2024 జూన్ 11న దర్శన్, పవిత్ర గౌడ, మరో 15 మందిని చిత్రదుర్గకు చెందిన రేణుకస్వామి అనే ఫ్యాన్‌ను కిడ్నాప్ చేసి, దారుణంగా హత్య చేసిన ఆరోపణలపై అరెస్టు చేశారు.
-
Home
-
Menu