సాయిపల్లవి బాలీవుడ్ మూవీ వచ్చేది అప్పుడే!

సాయిపల్లవి బాలీవుడ్ మూవీ వచ్చేది అప్పుడే!
X

టాలెంటెడ్ నటి సాయిపల్లవి బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఆమె తొలి హిందీ చిత్రం “ఏక్ దిన్”. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఆమెకు జోడిగా ఆమిర్ ఖాన్ తనయుడు జూనైద్ ఖాన్ నటిస్తున్నాడు. సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించగా, మంసూర్ ఖాన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జునైద్ ఖాన్‌కు ఇది మొదటి లీడ్ రోల్ కావడంతో, ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు కొత్త జంటను పరిచయం చేస్తోంది. ఈ చిత్రం 2025 నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది.

ఇక మరోవైపు, సాయిపల్లవి నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకమైన “రామాయణ” చిత్రంలో సీతాదేవిగా నటించనున్నారు. ఇందులో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. రామాయణ పార్ట్ 1 వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా విడుదల కానుంది.

Tags

Next Story