సాయిధరమ్ హై వోల్టేజ్ యాక్షన్

సాయిధరమ్ హై వోల్టేజ్ యాక్షన్
X
‘విరూపాక్ష, బ్రో’ విజయాల తరువాత, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాతో రాబోతున్నాడు. సాయితేజ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

‘విరూపాక్ష, బ్రో’ విజయాల తరువాత, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాతో రాబోతున్నాడు. సాయితేజ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకోసం లేటెస్ట్ గా ఓ హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించడానికి రెడీ అవుతుంది టీమ్.

ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ కొరియోగ్రఫీలో చిత్రీకరించే ఆ ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సీక్వెన్స్ ను ఈ సెప్టెంబర్ మిడ్ నుంచి షురూ చేయబోతున్నారట. ఈ ఫైట్ లో ఈ చిత్రంలోని ప్రధాన ప్రతినాయకుడితో హీరో సాయిధరమ్ తలపడే సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇక అంతకుముందే ఈ చిత్రం కోసం చిత్రీకరించిన ఓ పాట ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ పాటను ఏకంగా వెయ్యి మంది డ్యాన్సర్స్ తో చిత్రీకరించారు.

‘హనుమాన్’ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ రోహిత్ కెపి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. అసలు దసరా బరిలో రావాల్సిన ఈ సినిమా రిలీజ్ డేట్ పై త్వరలో క్లారిటీ రానుంది.

Tags

Next Story