విజయ్ దేవరకొండకు నో చెప్పిన రుక్మిణి.. కారణమేంటి?

విజయ్ దేవరకొండకు నో చెప్పిన రుక్మిణి.. కారణమేంటి?
X

విజయ్ దేవరకొండకు నో చెప్పిన రుక్మిణి.. కారణమేంటి?‘సప్తసాగరాలు దాటి’తో గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్, ఆ తర్వాత చేసిన చిత్రాల ఎంపికలో అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. ‘సప్తసాగరాలు..‘ తర్వాత చేసిన ‘బఘీర, భైరతి రణగల్‘ వంటి వాటిలో రుక్మణికి ఆశించిన స్థాయి పాత్రలు దక్కలేదు.

గ్లామరస్ రోల్స్ కు దూరంగా ఉంటూ పెర్ఫామెన్స్ కు ప్రాధాన్యతనిస్తున్న రుక్మిణి తన ఆశలు అన్నీ ‘డ్రాగన్‘పై పెట్టుకుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న ‘డ్రాగన్‘లో రుక్మిణి పాత్రను ఎంతో ప్రత్యేకంగా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమా చేస్తున్నన్ని రోజులూ మరో మూవీకి కమిట్ అవ్వకూడదని కాంట్రాక్ట్ కూడా రాసిందట రుక్మిణి.

అసలు విజయ్ దేవరకొండ, రవి కిరణ్ కోలా కాంబోలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో రుక్మిణి ని నాయికగా తీసుకోవాలనుకున్నారట. ‘డ్రాగన్‘ కోసమే రుక్మిణి.. రౌడీ స్టార్ తో సినిమాని కూడా వదులుకున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనం. మొత్తంగా ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ రుక్మిణి వసంత్ ను ఏ స్థాయిలో నిలబెడుతుందో చూడాలి.

Tags

Next Story