రూ. 200 కోట్ల దిశ గా మోహన్ లాల్ 'తుడరుమ్'

రూ. 200 కోట్ల దిశ గా మోహన్ లాల్ తుడరుమ్
X

రూ. 200 కోట్ల దిశ గా మోహన్ లాల్ 'తుడరుమ్'ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తాజా చిత్రం "తుడరుమ్" టికెట్ కౌంటర్ల వద్ద ఇప్పటికి హౌస్ ఫుల్ బోర్డు లు వేలాడుతున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ప్రశంసలు రెండూ పుష్కలం గా దక్కాయ్. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రదర్శన ట్రేడ్ పండితుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తొలి వారం రోజుల్లోనే తుడరుమ్ ప్రపంచ వ్యాప్తం గా సుమారు రూ. 120 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మాలీవుడ్ ఇండస్ట్రీ కి ఇది అసాధారణమైన విజయంగా పరిగణించ బడుతోంది. ఇప్పుడు ఈ సినిమా రూ. 200 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. కేరళలో ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. లైఫ్‌టైమ్ వసూళ్లలో ఇది రూ. 100 కోట్ల మార్క్ చేరుతుందని అంచనా.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి $7 మిలియన్ (సుమారు రూ. 58 కోట్లు) పైగా వసూళ్లు వచ్చాయి. ఈ వారాంతానికి, మోహన్‌లాల్ నటించిన ఈ చిత్రం "అవేశం", "ఆడు జీవితం'' వంటి బ్లాక్‌బస్టర్‌ల లైఫ్‌టైమ్ రికార్డులను అధిగమించనున్నదిగా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

తెలుగులో కూడా తుడరుమ్ విడుదలైందేమో కానీ, ప్రమోషన్ లేకపోవడం వల్ల ఆ భాషలో పెద్దగా గుర్తింపు పొందలేకపోయింది. అయితే మలయాళ ప్రేక్షకుల్లో మాత్రం ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

Tags

Next Story