ఆస్కార్ పోస్టర్‌లో RRR స్టంట్!

ఆస్కార్ పోస్టర్‌లో RRR స్టంట్!
X
ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలై మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ, ఇప్పటికీ ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అభిమానులలో ఉత్సాహం ఉరకలేస్తుంది.

తాజాగా ఆస్కార్ అకాడమీ కీలక నిర్ణయం తీసుకుంది. 2028 నుంచి 'స్టంట్ డిజైన్' విభాగాన్ని కొత్తగా ప్రవేశపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2027లో విడుదలయ్యే సినిమాలు ఈ కేటగిరీకి అర్హత కలిగి ఉండనున్నాయి. ఈ సందర్భంగా అకాడమీ విడుదల చేసిన ప్రమోషనల్ పోస్టర్లో, హాలీవుడ్ సినిమాల సరసన RRRలోని రామ్ చరణ్ స్టంట్ సీన్‌ను కూడా చేర్చారు. ఇది భారతీయ చిత్రసీమకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నారు.

దీనిపై దర్శకధీరుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేస్తూ, ఇది వందేళ్ల నిరీక్షణకు ఫలితమని పేర్కొన్నారు. స్టంట్ డిజైన్‌కు ప్రత్యేక అవార్డు ప్రవేశపెట్టిన అకాడమీకి, ముఖ్యంగా ఈ నిర్ణయానికి కృషి చేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Next Story