నాని – శ్రీనిధి మధ్య ‘ప్రేమ వెల్లువ’

నాని – శ్రీనిధి మధ్య ‘ప్రేమ వెల్లువ’
X
నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3'. ‘హిట్’ ఫ్రాంచైజీలో మూడో పార్ట్‌గా రాబోతున్న ఈ సినిమాలో నాని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3'. ‘హిట్’ ఫ్రాంచైజీలో మూడో పార్ట్‌గా రాబోతున్న ఈ సినిమాలో నాని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. నానికి జోడీగా ‘కె.జి.యఫ్‘ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తుంది. వేసవి కానుకగా మే 1న ‘హిట్ 3‘ విడుదలకు ముస్తాబవుతుంది.

ఇప్పటికే ‘హిట్ 3‘ టీజర్ రిలీజయ్యింది. టీజర్ లో నాని పోషిస్తున్న అర్జున్ సర్కార్ క్యారెక్టర్ మాస్ ర్యాంపేజ్ చూశాము. ఇప్పుడు అర్జున్ సర్కార్ రొమాంటిక్ మోడ్ లోకి మారాడు. ఈ సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ గా సాగే ‘ప్రేమ వెల్లువ‘ అంటూ సాగే గీతం విడుదలకాబోతుంది. రేపు (మార్చి 24) రిలీజ్ కానున్న ఈ పాటకు సంబంధించి ప్రోమో వచ్చింది.



Tags

Next Story