'కిష్కింధపురి' నుంచి రొమాంటిక్ మెలోడీ

X
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 'కిష్కింధపురి'. 'రాక్షసుడు' వంటి హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న మరో మూవీ ఇది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 'కిష్కింధపురి'. 'రాక్షసుడు' వంటి హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న మరో మూవీ ఇది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి 'ఉండిపోవే నాతోనే..' అంటూ సాగే రొమాంటిక్ మెలోడీ రిలీజయ్యింది.
చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ గీతానికి పూర్ణాచారి సాహిత్యం అందించగా, జావెద్ అలీ ఆలపించారు. సముద్రపు అందాలతో రాజ్ సుందరం మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ లిరికల్ గా ఆకట్టుకుంటుంది. ఇటీవల 'భైరవం'తో ఫర్వాలేదనిపించిన బెల్లంకొండ 'కిష్కింధపురి'తో పాటు.. 'హైందవ, టైసన్ నాయుడు' వంటి మరికొన్ని సినిమాలను లైన్లో పెట్టాడు.
Next Story
-
Home
-
Menu