'బ్యాడ్ గాళ్స్' నుంచి రొమాంటిక్ మెలోడీ!

బ్యాడ్ గాళ్స్ నుంచి రొమాంటిక్ మెలోడీ!
X
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మున్నా లేటెస్ట్ మూవీ ‘బ్యాడ్ గాళ్స్’. ఈ చిత్రానికి ‘బ్యాడ్ గాళ్స్.. కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్.

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మున్నా లేటెస్ట్ మూవీ ‘బ్యాడ్ గాళ్స్’. ఈ చిత్రానికి ‘బ్యాడ్ గాళ్స్.. కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి 'ఇలా చూసుకుంటానే' అంటూ సాగే మెలోడీ హీరో రానా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా విడుదల చేశాడు.

అనూప్ రూబెన్స్ సంగీతంలో ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమాలోని 'నీలి నీలి ఆకాశం' తరహాలో సాగే 'ఇలా చూసుకుంటానే' అంటూ ఈ సాగే ఈ రొమాంటిక్ మెలోడీ ఆకట్టుకుంటుంది. జమ్మూ కాశ్మీర్, మలేషియాలలో అద్భుతమైన లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరించారు.

ఈ సినిమా యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా అలరిస్తుందని చిత్రబృందం చెబుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది.



Tags

Next Story