‘రాబిన్ హుడ్‘ టికెట్ రేట్లు.. అసలు సంగతేంటి?

‘రాబిన్ హుడ్‘ టికెట్ రేట్లు.. అసలు సంగతేంటి?
X
ఈమధ్య కాలంలో పెద్ద సినిమాల కోసం టికెట్ రేట్లు పెంపు అనేది సర్వసాధారణంగా మారింది. అయితే ‘పుష్ప 2‘ ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోస్, టికెట్ రేట్లు పెంపు విషయంలో ఎంతో కఠినంగా వ్యవహరిస్తుంది.

ఇక ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘రాబిన్ హుడ్‘ సినిమాకి టికెట్ రేట్లు పెంచబోతున్నారని, బెనిఫిట్ షోస్ వేయబోతున్నారని పలు వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. తాజాగా ఆ వార్తలను ఖండించింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.

‘రాబిన్ హుడ్‘ మూవీకి తెలంగాణలో ఎలాంటి టికెట్ రేట్లు పెంపు ఉండదని స్పష్టం చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రీమియమ్ లొకేషన్స్ లో మాత్రమే కొంతమేర టికెట్ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈనెల 28 నుంచి మీ సమీప థియేటర్లలో ‘రాబిన్ హుడ్‘ని చూసి, పరిపూర్ణమైన వినోదాన్ని ఆస్వాదించండి అంటూ ప్రేక్షకులను కోరింది నిర్మాణ సంస్థ మైత్రీ.

ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి పూర్తి చేసుకున్న ‘రాబిన్ హుడ్‘ చిత్రానికి ‘యు/ఎ‘ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఈ సినిమాని చూసేందుకు టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షో లో 80 కె ఇంట్రెస్ట్స్ వచ్చాయి.

Tags

Next Story