‘రెట్రో’ టీజర్: స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ గా సూర్య!

‘రెట్రో’ టీజర్: స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ గా సూర్య!
X
సూర్య హీరోగా భారీ అంచనాలతో వచ్చిన 'కంగువా' తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'రెట్రో' సినిమాతో గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడు సూర్య.

సూర్య హీరోగా భారీ అంచనాలతో వచ్చిన 'కంగువా' తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'రెట్రో' సినిమాతో గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడు సూర్య. లేటెస్ట్ గా 'రెట్రో' మూవీ తెలుగు టీజర్ రిలీజయ్యింది.

ఈ మూవీలో సూర్యకి జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. 'రెట్రో' టీజర్ లో ప్రేయసి పూజా హెగ్డేతో పెళ్లి కోసం తాను తన గొడవలు, రౌడీయిజం వంటివి మానేస్తాననే చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇంకా ఈ టీజర్ లో కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ గ్యాంగ్ స్టర్ డ్రామా విజువల్స్ మరో హైలైట్.

ఈ సినిమాలో జోజు జార్జ్, జయరామ్, కరుణాకరన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతుంది. మే 1న 'రెట్రో' రిలీజ్ కు రెడీ అవుతుంది.



Tags

Next Story