‘కన్నప్ప‘ నుంచి రెబెల్ స్టార్ లుక్ రిలీజ్!

‘కన్నప్ప‘ నుంచి రెబెల్ స్టార్ లుక్ రిలీజ్!
X
విష్ణు మంచు మోస్ట్ అవైటింగ్ మూవీ ‘కన్నప్ప‘ నుంచి రెబెల్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న లుక్ వచ్చేసింది. ‘కన్నప్ప‘ సినిమాలో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.


విష్ణు మంచు మోస్ట్ అవైటింగ్ మూవీ ‘కన్నప్ప‘ నుంచి రెబెల్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న లుక్ వచ్చేసింది. ‘కన్నప్ప‘ సినిమాలో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో ‘రుద్ర‘ పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు. అలాగే ‘కన్నప్ప‘లో రుద్ర పాత్ర ఎలా ఉండబోతుందనే సందేశాన్ని కూడా ఈ పోస్టర్ లో ఇచ్చారు.

‘అతను ఉగ్ర తుఫాను! గతం, భవిష్యత్తు కాలాల మార్గదర్శి. అతడు శివుని ఆజ్ఞతో పరిపాలిస్తున్నాడు‘ అంటూ రుద్ర క్యారెక్టర్ ఇంట్రోని ఈ పోస్టర్ లో ఇచ్చారు. మొత్తంగా చేతిలో కర్రతో రుద్ర అవతారంలో ప్రభాస్ ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు ‘కల్కి‘ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ను మురిపించబోయే ఈ చిత్రంతోనే. ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న ‘కన్నప్ప‘ చిత్రం ఏప్రిల్ 25న పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతుంది.

Tags

Next Story