క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ‘RC16’?

గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RC16'గురించి ఆసక్తికర అప్‌డేట్స్ బయటకొస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంతో కూడిన ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.
ప్రస్తుతం ఈ మూవీ కోసం నైట్ ఎఫెక్ట్ లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. పీరియాడిక్ టచ్ తో స్పోర్ట్స్ డ్రామాగా 'RC16' తెరకెక్కుతుంది. అందుకోసమే.. ఈ సినిమా షూట్ కోసం నైట్ ఎఫెక్ట్ లో భారీ ఫ్లడ్ లైట్స్ ఉపయోగిస్తున్నారు. ఇదే విషయాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. రత్నవేలు లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోలో 'నైట్ షూట్, ఫ్లడ్ లైట్స్, పవర్ క్రికెట్, డిఫరెంట్ యాంగిల్స్' అనే క్యాప్షన్ పెట్టాడు.
స్టేడియంలో ఉండే ఫ్లడ్ లైట్స్ ఫొటోను షేర్ చేయడంతో ఈ సినిమా కథ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లోనే నడవనుందనే అంచనాలు పెరుగుతున్నాయి. అది కూడా క్రికెట్ బ్యాక్‌డ్రాప్ అనేది స్పష్టమవుతుంది. సినిమాటోగ్రాఫర్స్ లో రత్నవేలు రూటే సెపరేటు. తన సినిమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుంటాడు రత్నవేలు. గతంలో 'దేవర' విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు 'రంగస్థలం' తర్వాత రామ్ చరణ్ తో చేస్తున్న 'RC16' గురించి వరుసగా క్రేజీ అప్డేట్స్ అందిస్తున్నాడు.
'RC16'లో చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది. నెగటివ్ రోల్ లో 'మీర్జాపూర్' ఫేమ్ దివ్యేందు శర్మ కనిపించబోతున్నాడు. జగపతిబాబు, శివరాజ్ కుమార్ పాత్రలు కూడా ఈ సినిమాలో ఎంతో పవర్‌ఫుల్ గా ఉంటాయట.
-
Home
-
Menu