హీరోగా రవితేజ తమ్ముడు కొడుకు

మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి కొత్త హీరో వస్తున్నాడు. రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు ‘మారెమ్మ‘ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. రూరల్ యాక్షన్ డ్రామాగా మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మాధవ్ భూపతిరాజు బర్త్ డే స్పెషల్ గా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో మాధవ్ పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, రగ్గడ్ లుక్‌తో మాస్ అవతారంలో కనిపించాడు. ముఖ్యంగా లుంగీ కట్టుకొని కబడ్డీ మైదానంలోకి నడుస్తూ వచ్చే సన్నివేశంలో మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటున్నాడు.
ఈ సినిమాలో మాధవ్ కి జోడీగా దీపా బాలు నటిస్తుంది. కీలక పాత్రల్లో వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, దయానంద్ రెడ్డి, రూపలక్ష్మి కనిపించనున్నారు. ప్రశాంత్ విహారి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ చిత్రం త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది.
-
Home
-
Menu