మాస్ మహారాజ 'మాస్ జాతర' గ్లింప్స్ అదిరింది!

X
మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ 'మాస్ జాతర'. 'మాస్ జాతర.. మనదే ఇదంతా' అంటూ 'ఇడియట్' సినిమాలోని రవితేజని గుర్తు చేసేలా ఈ మూవీ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది.
మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి ఈరోజు రవితేజ బర్త్ డే స్పెషల్ గా గ్లింప్స్ రిలీజయ్యింది. ఈ గ్లింప్స్ అభిమానుల అంచనాలను పెంచుతూ రవితేజ వింటేజ్ మాస్ లుక్‌ను హైలైట్ చేస్తుంది.
'మాస్ జాతర.. మనదే ఇదంతా' అంటూ 'ఇడియట్' సినిమాలోని రవితేజని గుర్తు చేసేలా ఈ మూవీ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. మొత్తంగా మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్స్ ఆయన నుంచి ఎలిమెంట్స్ కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నట్టు ఈ మాస్ ర్యాంపేజ్ గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది.
'ధమాకా' తర్వాత రవితేజ, శ్రీలీల నటిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 9న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
Next Story
-
Home
-
Menu