రవితేజ బర్త్ డే స్పెషల్ గా ‘మాస్ జాతర‘ ట్రీట్!

మాస్ మహారాజ రవితేజ మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం తన 75వ చిత్రంగా ‘మాస్ జాతర‘ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే గాయపడ్డ రవితేజ.. కొన్ని నెలల పాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ‘మాస్ జాతర‘ను ఫుల్ స్వింగ్ లో పూర్తి చేస్తున్నాడు. భాను భోగారపు దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మే 9న రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసుకున్న ‘మాస్ జాతర‘ నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుందట టీమ్. జనవరి 26న రవితేజ బర్త్ డే స్పెషల్ గా ప్రత్యేకమైన టీజర్ ను విడుదల చేసే సన్నాహాల్లో ఉందట. ఈ సినిమాలో రవితేజకి జోడీగా శ్రీలీల నటిస్తుంది. ‘ధమాకా‘ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న మూవీ ఇది. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మొత్తంగా ‘మాస్ జాతర‘తో మాస్ మహారాజ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.
-
Home
-
Menu