ఈ ఏడాది ముచ్చటగా మూడు సినిమాలు

ఈ ఏడాది ముచ్చటగా మూడు సినిమాలు
X
ఈ ఏడాది థియేటర్లలో విడుదల కావాల్సినవి రష్మిక మందన్నవి మూడు సినిమాలు ఉన్నాయి.

ఈ ఏడాది థియేటర్లలో విడుదల కావాల్సినవి రష్మిక మందన్నవి మూడు సినిమాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆమె నటించిన హిందీ సినిమాలు “ఛావా”, “సికందర్” విడుదలయ్యాయి.

తాజాగా ధనుష్ హీరోగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన “కుబేరా” వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం రష్మిక ప్రమోషన్లకు సిద్ధమవుతోంది.

అలాగే ఆమె తొలి మహిళా ప్రాధాన్య చిత్రం “ది గర్ల్‌ఫ్రెండ్” కూడా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెలలో ఈ చిత్రానికి సంబంధించిన పాటను విడుదల చేయనున్నారు.

“కుబేరా”, “ది గర్ల్‌ఫ్రెండ్” సినిమాలు ఈ ఏడాది రష్మిక తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్న చిత్రాలు. గత సంవత్సరం ఆమె కెరీర్‌లోనే అత్యంత భారీ హిట్‌గా నిలిచింది “పుష్ప 2.

ఈ ఏడాది ముగింపులో మరో బాలీవుడ్ సినిమా “థామా” కూడా థియేటర్లలో విడుదల కానుంది. రష్మిక అభిమానులు ఆమె సినిమాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags

Next Story