యోధురాలిగా మారిన రష్మిక

యోధురాలిగా మారిన రష్మిక
X
నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక వరుస విజయాలతో దూసుకుపోతుంది. ‘యానిమల్, పుష్ప 2, కుబేర‘ వంటి హిట్స్ తర్వాత ఇప్పుడు ‘ది గర్ల్ ఫ్రెండ్‘ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక వరుస విజయాలతో దూసుకుపోతుంది. ‘యానిమల్, పుష్ప 2, కుబేర‘ వంటి హిట్స్ తర్వాత ఇప్పుడు ‘ది గర్ల్ ఫ్రెండ్‘ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో ఫీమేల్ సెంట్రిక్ మూవీగా ‘ది గర్ల్ ఫ్రెండ్‘ రెడీ అవుతోంది.

‘ది గర్ల్ ఫ్రెండ్‘తో పాటు లేటెస్ట్ గా మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రష్మిక. హను రాఘవపూడి అసోసియేట్ రవీంద్ర పుల్లె దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పేరు ‘మైసా’. ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మించనుంది.

తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్‌లో రష్మిక యోధురాలిలా, అత్యంత భయంకరమైన అవతారంలో కనిపించి ఆసక్తి రేకెత్తిస్తుంది. ‘ధైర్యం ఆమె బలం. సంకల్పంలో లేదు కనికరం.. ఆమె గర్జన వినడానికి కాదు.. భయపెట్టడానికి..!” అనే పవర్‌ఫుల్ కొటేషన్ తో ఈ టైటిల్ పోస్టర్ ను షేర్ చేశారు.



Tags

Next Story