రష్మిక దెయ్యం ప్రేమకథ

రష్మిక దెయ్యం ప్రేమకథ
X
పాన్ ఇండియా లెవెల్ లో హీరోయిన్‌గా దూసుకుపోతుంది రష్మిక. ‘యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర‘ వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకుంది. ఇక బాలీవుడ్ లో ‘ఛావా‘ తర్వాత రష్మిక నుంచి రాబోతున్న మరో చిత్రం ‘థామా‘.

పాన్ ఇండియా లెవెల్ లో హీరోయిన్‌గా దూసుకుపోతుంది రష్మిక. ‘యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర‘ వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకుంది. ఇక బాలీవుడ్ లో ‘ఛావా‘ తర్వాత రష్మిక నుంచి రాబోతున్న మరో చిత్రం ‘థామా‘. సూపర్ హిట్ హారర్ సిరీస్ ‘స్త్రీ‘ యూనివర్శ్ లో భాగంగా వస్తోంది. ఈ సినిమాలో రష్మిక, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించారు. మడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్న ‘థామా‘ నుంచి ట్రైలర్ వచ్చింది.

ఈ సినిమాలో రష్మిక దెయ్యం పాత్రలో కనిపించబోతుంది. ఆ తర్వాత కొన్ని పరిణామాలతో ఆయుష్మాన్ కూడా దెయ్యంగా మారడం.. వీరిద్దరి ప్రేమకథ ఇతివృత్తంగా ‘థామా‘ రెడీ అయ్యింది. ఈ సినిమాలో పరేష్ రావెల్, నవజుద్దీన్ సిద్ధిఖీ, సత్యరాజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారర్, కామెడీ, రొమాన్స్ కలగలిపిన కథాంశంతో రూపొందిన ‘థామా‘ దీపావళి కానుకగా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Tags

Next Story