గడువు కోరిన రానా, మంచు లక్ష్మి

గడువు కోరిన రానా, మంచు లక్ష్మి
X
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌ కేసు టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ వ్యవహారంలో ప్రముఖ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్ లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.

జూలై 23న విచారణకు హాజరుకావాలని రానాను ఈడీ ఆదేశించినా, ఆయన షూటింగ్ షెడ్యూల్ కారణంగా గడువు కోరారు. మంచు లక్ష్మి కూడా ఆగస్టు 13న విచారణకు రావాల్సి ఉండగా, ఆ రోజు హాజరుకాలేనని ఆమె వెల్లడించారు. ప్రకాష్ రాజ్ జూలై 30న, విజయ్ దేవరకొండ ఆగస్టు 6న విచారణకు హాజరవుతారు.

ఈ కేసు పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖపట్నం పోలీస్‌ స్టేషన్లలో నమోదైన మానీలాండరింగ్ కేసుల ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది. మొత్తం 29 మంది సినీ నటులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై ఈసీఐఆర్ నమోదైంది.

ఇటీవల, గూగుల్‌, మెటా సంస్థలకూ ఈడీ నోటీసులు పంపింది. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్, షేర్‌చాట్‌, ఎక్స్ వంటి ప్లాట్‌ఫాంలలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వ్యవహారంపై కూడా విచారణ కొనసాగుతోంది. ప్రమోషన్‌కు సంబంధించి సెలబ్రిటీలు చేసిన అగ్రిమెంట్లు, వారి బ్యాంక్ వివరాలను తెచ్చుకోవాలని ఈడీ ఆదేశించింది.

Tags

Next Story