రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘రామం రాఘవం‘!

X
కమెయడిన్ ధనరాజ్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రామం రాఘవం‘. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో కొడుకుగా ధనరాజ్ నటిస్తుంటే.. తండ్రి పాత్రలో విలక్షణ నటుడు సముద్రఖని కనిపించబోతున్నాడు.
కమెయడిన్ ధనరాజ్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రామం రాఘవం‘. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో కొడుకుగా ధనరాజ్ నటిస్తుంటే.. తండ్రి పాత్రలో విలక్షణ నటుడు సముద్రఖని కనిపించబోతున్నాడు. తాజాగా ధనరాజ్ ‘రామం రాఘవం‘ విడుదల తేదీ ఖరారు చేసుకుంది. ఫిబ్రవరి 28న ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతుంది.
పృథ్వి పొలవరపు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ ద్విభాష చిత్రానికి 'విమానం' దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను సమకూరుస్తున్నాడు. ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, పృథ్వీ, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది.
Next Story
-
Home
-
Menu