రామ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. వరుసగా మాస్ మూవీస్ చేసిన రామ్.. ఈసారి అందుకు భిన్నంగా ఓ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీతో రాబోతున్నాడు. ‘బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్‘ అంటూ ఓ డై హార్డ్ ఫ్యాన్ స్టోరీతో రూపొందుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. నవంబర్ 28న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
ఇదే విషయాన్ని ఎనర్జిటిక్ స్టార్ తెలుపుతూ సోషల్ మీడియాలో రిలీజ్ డేట్ పోస్టర్ షేర్ చేశాడు. ఈ పోస్టర్ లో ‘మెగా, లయన్, కింగ్, విక్టరీ, పవర్, సూపర్, రెబెల్, టైగర్, మెగాపవర్, స్టైలిష్, రియల్, రజనీ, కమల్ హాసన్‘ అంటూ అందరి ఫ్యాన్స్ ను పలకరిస్తూ మిమ్మల్నే సినిమాలో చూసుకున్నట్టుగా ‘ఆంధ్ర కింగ్ తాలూకా‘ ఉంటుందని తెలిపాడు రామ్.
ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. కీలక పాత్రలో ఉపేంద్ర కనిపించబోతున్నాడు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. మొత్తంగా.. రామ్ సరికొత్తగా కనిపించబోతున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా‘ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
Dear MEGA,LION,KING,VICTORY, POWER,SUPER,REBEL,TIGER,MEGAPOWER,STYLISH,REAL,RAJINI,KH…fans of all the other Stars.
— RAm POthineni (@ramsayz) August 21, 2025
& My Dearest Fans,
Have you ever watched yourself in a movie?
Get Ready to Relive Your Life on the BIG Screen this year! #AndhraKingTaluka on 28-11-25 pic.twitter.com/8Ycscf1vuC
-
Home
-
Menu