రాజమండ్రి వెళుతున్న రామ్ పోతినేని!

రాజమండ్రి వెళుతున్న రామ్ పోతినేని!
X
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇప్పుడు రొమాంటిక్ మోడ్ లో ఉన్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ కు బ్రేక్ ఇచ్చి.. సాప్ట్ క్యారెక్టర్ తో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ లో రామ్ హీరోగా కొత్త సినిమా రూపొందుతుంది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇప్పుడు రొమాంటిక్ మోడ్ లో ఉన్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ కు బ్రేక్ ఇచ్చి.. సాప్ట్ క్యారెక్టర్ తో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ లో రామ్ హీరోగా కొత్త సినిమా రూపొందుతుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ ఫేమ్ మహేష్ బాబు.పి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.

ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ లేటెస్ట్ గా రాజమండ్రిలో కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతుంది. ఫిబ్రవరి 10 నుంచి రాజమండ్రి పరసర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జరుపుకోనుందట. ఈ సినిమాలో రామ్ కి జోడీగా ‘మిస్టర్ బచ్చన్‘ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. ఈ చిత్రంలో సాగర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు రామ్. మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ కనిపించనుంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ మూవీ రామ్ కెరీర్ లో 22వ చిత్రం.

Tags

Next Story