రామ్‌చరణ్ బర్త్‌డే స్పెషల్ గా 'RC16' ట్రీట్!

రామ్‌చరణ్ బర్త్‌డే స్పెషల్ గా RC16 ట్రీట్!
X

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'RC16'. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. క్రికెట్, రెజ్లింగ్ వంటి రెండు స్పోర్ట్స్ ను మిళితం చేసి బుచ్చిబాబు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడట. తొలుత మైసూర్ లో మేజర్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ ఆ తర్వాత హైదరాబాద్ లో కీలక సన్నివేశాల షూటింగ్ పూర్తి చేసుకుంది.

హైదరాబాద్ షెడ్యూల్ లో క్రికెట్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారట. ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ ని ఢిల్లీలో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో జరిగే ఈ షెడ్యూల్ లో రెజ్లింగ్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తారట. కథలో క్రీడలకు కీలకంగా ప్రాధాన్యం ఉండడంతో, రామ్‌చరణ్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనుందని టాక్.

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. 'దేవర' తర్వాత జాన్వీ నటిస్తున్న రెండో తెలుగు సినిమా ఇది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు వంటి వారు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆస్కార్ విజేత రెహమాన్ సంగీతం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్ గా ఈ సినిమా టైటిల్, టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Tags

Next Story