క్షమాపణలు చెప్పిన రాజేంద్ర ప్రసాద్

'రాబిన్ హుడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు గురికావడంతో, ఆయన తన వ్యాఖ్యలపై స్పందిస్తూ బహిరంగ క్షమాపణలు తెలిపారు.
రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ‘ఈవెంట్ సందర్భంగా సరదాగా మాట్లాడిన మాటలు అనుకోకుండా తప్పుడు అర్థం పుచ్చుకున్నారు. వార్నర్ నాకు చాలా ఇష్టం. మేమంతా సరదాగా ముచ్చటించుకుంటూ, ఒకరికొకరు ఆటపట్టించుకున్నాం. ఎవరికైనా నా మాటలు అసౌకర్యంగా అనిపించి ఉంటే, హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుకుంటున్నాను‘ అన్నారు.
మార్చి 28న విడుదల కానున్న ‘రాబిన్ హుడ్’ చిత్రంలో నితిన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించారు. ఇంకా రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ లతో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
-
Home
-
Menu