శివ తత్వం వైపు జక్కన్న!

ప్రస్తుతం టాలీవుడ్ టు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో డివోషనల్ ట్రెండ్ జోరుగా సాగుతుంది. దైవత్వంతో కూడిన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ లిస్టులోకి ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి కూడా చేరబోతున్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్ గా SSMB29 ప్రీ లుక్ పోస్టర్ చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
ప్రీ లుక్ పోస్టర్ లో మహేష్ మెడలో రుద్రాక్ష, త్రిశూలం, ఢమరుకం, నంది, త్రినేత్రం వంటివి ధరించిన లాకెట్ కనిపిస్తుంది. దీన్ని బట్టి ఈ చిత్రంలో రాజమౌళి శివ తత్వాన్ని చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకోసం ఇప్పటికే వారణాసి బ్యాక్ డ్రాప్ లో భారీ సెట్ నిర్మాణం కూడా చేశాడు జక్కన్న. ఆ సెట్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయ్యిందట. మొత్తంగా.. సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ మంత్రగా మారిన డివోషనల్ ట్రెండ్ లో రాజమౌళి చేయబోతున్న SSMB29 ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
-
Home
-
Menu