చిత్ర బృందానికి స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టిన రాజమౌళి!

చిత్ర బృందానికి స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టిన రాజమౌళి!
X
SSMB29 కి సంబంధించి ఎలాంటి సమాచారం లీక్ కాకుండా చిత్రబృందానికి కఠినమైన ఆంక్షలు జారీ చేశాడట జక్కన్న. ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరితో నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడట.

భారతీయ సినీ చరిత్రలో దర్శకధీరుడు రాజమౌళిది ప్రత్యేకమైన అధ్యాయం. ఇండియన్ సినీ ఇండస్ట్రీ దశ దిశను మార్చే సత్తా ఉన్న దర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న జక్కన్న.. ఇప్పటివరకూ ఒక్క అపజయం కూడా లేకుండా సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.

తన సినిమాలకు సంబంధించి రాజమౌళి మాటే శాసనం. తాను నిర్దేశించిన బడ్జెట్ లో.. తాను అనుకున్న నటీనటులతో సినిమాలను రూపొందించడం దర్శకధీరుడు స్టైల్. లేటెస్ట్ గా మహేష్ బాబు తో తెరకెక్కిస్తున్న సినిమాకి సంబంధించి చిత్రబృందానికి కొన్ని కండిషన్స్ పెట్టాడట రాజమౌళి.

విజయేంద్ర ప్రసాద్ రాసిన కథ ఆధారంగా ఆద్యంతం జంగిల్ అడ్వంచరస్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇప్పటికే సైలెంట్ గా ముహూర్తాన్ని పూర్తి చేసుకుని షూటింగ్ సైతం మొదలు పెట్టుకుంది ఈ చిత్రం. ఇటీవల రాజమౌళి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో మహేష్ పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నట్లు సూచించే వీడియోను షేర్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలైనట్టు స్పష్టమైంది.

కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి సమాచారం లీక్ కాకుండా చిత్రబృందానికి కఠినమైన ఆంక్షలు జారీ చేశాడట జక్కన్న. ఇప్పటివరకూ ఈ సినిమాలో నటించే మహేష్ బాబు, ప్రియాంక చోప్రా వంటి ప్రధాన నటీనటుల వివరాలు మాత్రమే బయటకు రాగా, మిగతా నటీనటుల వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు.ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరితో నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్ కుదుర్చుకుందట టీమ్.

Tags

Next Story