రాజమండ్రి షెడ్యూల్ పూర్తి!

రాజమండ్రి షెడ్యూల్ పూర్తి!
X
ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త సినిమా శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. రామ్ 22వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేశ్ బాబు.పి తెరకెక్కిస్తున్నాడు.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త సినిమా శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. రామ్ 22వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేశ్ బాబు.పి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది.

ఇటీవల ఈ సినిమా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 34 రోజుల పాటు కీలక షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ షెడ్యూల్ లో చిత్రబృందం రెండు పాటలు, భారీ యాక్షన్ సీక్వెన్స్, ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించింది. ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి గాంచిన రాజమండ్రి లొకేషన్లను ఈ మూవీలో అద్భుతంగా చిత్రీకరించినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.

మార్చి 28 నుంచి హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో రామ్ సాగర్‌గా కనిపించబోతున్నాడు. మ్యూజికల్ డ్యూయో వివేక్-మెర్విన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటివి గణేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్, రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది.

Tags

Next Story