'చిరంజీవ'గా రాజ్ తరుణ్

యంగ్ హీరో రాజ్ తరుణ్ మరోసారి కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అభినయ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'చిరంజీవ' నవంబర్ 7 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో శివ అనే పాత్రలో రాజ్ తరుణ్ కనిపించనున్నాడు. చిన్నప్పటి నుంచే స్పీడుకు పేరుగాంచిన శివ, ఆ స్పీడు వల్లే ఆంబులెన్స్ డ్రైవర్‌గా మారతాడు. కానీ అతని జీవితంలో వచ్చే కొన్ని సంఘటనలు అతన్ని ఒక అద్భుతమైన రహస్యం వైపు నడిపిస్తాయి. ఎదుటివారి తలపై వారు ఎప్పుడు చనిపోతారో చూడగల శక్తి అతనికి ఉంటుంది. ఆ శక్తి అతని జీవితాన్ని ఎలా మార్చేసింది? అనేది ఈ సినిమా కథగా టీజర్ ను బట్టి తెలుస్తోంది.
రాజ్ తరుణ్ కి జోడీగా కుషిత కల్లపు నటిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్, లవ్, యాక్షన్, థ్రిల్ — అన్నీ కలిపిన ప్యాకేజీగా కనిపిస్తున్న ఈ మూవీ రాజ్ తరుణ్‌కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
-
Home
-
Menu