డైరెక్టర్ అవతారంలో రాహుల్ రామకృష్ణ!

డైరెక్టర్ అవతారంలో రాహుల్ రామకృష్ణ!
X
తెలుగు ప్రేక్షకులకు తన నేచురల్ యాక్టింగ్, కామెడీ టైమింగ్‌తో సుపరిచితుడైన రాహుల్ రామకృష్ణ ఇప్పుడు ఓ కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు.

తెలుగు ప్రేక్షకులకు తన నేచురల్ యాక్టింగ్, కామెడీ టైమింగ్‌తో సుపరిచితుడైన రాహుల్ రామకృష్ణ ఇప్పుడు ఓ కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. ఆ స్టార్ కమెడియన్ దర్శకుడిగా మారేందుకు రెడీ అవుతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించాడు. 'దర్శకుడిగా నా తొలి ప్రాజెక్ట్.. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే, దయచేసి మీ షోరీల్స్, ఫొటోలు నా మెయిల్‌కు పంపించండి' అని పోస్ట్ చేశాడు.

సినిమాల్లో నటించడంతో పాటు డైలాగ్ రైటర్‌గా కూడా పనిచేసిన అనుభవం రాహుల్‌కు ఉంది. ఇప్పటికే రాహుల్ డైరెక్టోరియల్ డెబ్యూకి కథ సిద్ధమై, నటీనటుల ఎంపిక ప్రక్రియ మొదలైనట్టు సమాచారం. ఈ సినిమాకి సంబంధించి మిగతా డిటెయిల్స్ త్వరలో వెలువడనున్నాయి. ఫిలిం సర్కిల్స్‌ లో వినిపిస్తున్న సమాచారం మేరకు, ఈ సినిమాకు ‘GOLD’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

‘అర్జున్ రెడ్డి, గీత గోవిందం, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, జాతిరత్నాలు, ఓం భీమ్ బుష్' వంటి చిత్రాల్లో రాహుల్ నటనకు మంచి పేరొచ్చింది. కమెడియన్స్ వెన్నెల కిషోర్, వేణు, ధనరాజ్ వంటి వారు డైరెక్టర్స్ గా మారారు. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ దర్శకుడిగా ఎలాంటి కెరీర్ ను బిల్డ్ చేసుకుంటాడో చూడాలి.



Tags

Next Story