బాలీవుడ్ లో ‘తుఫాన్‘ సృష్టిస్తున్న రెహమాన్ పాట!

బాలీవుడ్ లో ‘తుఫాన్‘ సృష్టిస్తున్న రెహమాన్ పాట!
X
సినీ సంగీత ప్రపంచంలో పెను సంచలనం ఏ.ఆర్.రెహమాన్. చాలా సంవత్సరాల తర్వాత ధనుష్ ‘రాయన్‘తో గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చాడు రెహమాన్. ఇదే ఊపులో ఇప్పుడు తెలుగులో రామ్ చరణ్ 16వ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

సినీ సంగీత ప్రపంచంలో పెను సంచలనం ఏ.ఆర్.రెహమాన్. దక్షిణ భారత చలన చిత్ర సీమతో మొదలైన రెహమాన్ ప్రస్థానం.. ఆస్కార్ వరకూ వెళ్లింది. తమిళంలో ఎన్నో బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్స్ అందించిన రెహమాన్.. బాలీవుడ్ లోనూ సంగీత దర్శకుడిగా ఒకానొక దశలో టాప్ చెయిర్ ను దక్కించుకున్నాడు. అయితే కొన్నేళ్లుగా రెహమాన్ మ్యూజికల్ మ్యాజిక్ పనిచేయడం లేదనే విమర్శలు వచ్చాయి.

చాలా సంవత్సరాల తర్వాత ధనుష్ ‘రాయన్‘తో గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చాడు రెహమాన్. ఇదే ఊపులో ఇప్పుడు తెలుగులో రామ్ చరణ్ 16వ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అలాగే బాలీవుడ్ లో ‘ఛావ‘ సినిమాతో మళ్లీ బాలీవుడ్ లోనూ సత్తా చాటుతానంటున్నాడు.

విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన ‘ఛావ‘పై భారీ అంచనాలున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి రెహమాన్ కంపోజ్ చేసి పాడిన ‘ఆయా రే తూఫాన్‘ సాంగ్ రిలీజైంది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో విజువల్ గానూ ఈ పాట తూఫాన్ సృష్టించేలా ఉంది. ‘ఛావ‘ సినిమా ఫిబ్రవరి 14న విడుదలకు ముస్తాబవుతుంది.



Tags

Next Story