‘పుష్ప 2‘ ఓ.ఎస్.టీ. వచ్చేసింది.. మిస్టరీ వీడినట్టే!

‘పుష్ప 2‘ ఓ.ఎస్.టీ. వచ్చేసింది.. మిస్టరీ వీడినట్టే!
X
‘పుష్ప 2‘ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ బయటకు వచ్చింది. ఈ సౌండ్ ట్రాక్ లోని సన్నివేశాలన్నింటికీ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ పేరునే వేయడం విశేషం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2‘ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం రూ.1850 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ సినిమాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.

‘పుష్ప 2‘ సంగీతం విషయంలో పెద్ద కాంట్రవర్శీ జరిగింది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ కేవలం పాటలు మాత్రమే ఇచ్చాడని.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ అందించారని. అయితే సినిమా విడుదల తర్వాత టైటిల్స్ లో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టైటిల్ కార్డ్ దేవిశ్రీప్రసాద్ పేరుపైనే వేశారు. అదనపు నేపథ్య సంగీతం అంటూ శ్యామ్ సి.ఎస్. పేరు వేశారు.

సినిమా విడుదల తర్వాత కూడా శ్యామ్ సి.ఎస్. ఈ చిత్రంలో తాను చాలా భాగం నేపథ్య సంగీతం అందించానని చెప్పాడు. లేటెస్ట్ గా ‘పుష్ప 2‘ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ బయటకు వచ్చింది. ఈ సౌండ్ ట్రాక్ లోని సన్నివేశాలన్నింటికీ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ పేరునే వేయడం విశేషం.

మరోవైపు ‘పుష్ప 2‘ రీ లోడెడ్ వెర్షన్ ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తుంది. 3 గంటల 40 నిమిషాల భారీ నిడివితో ఈ సినిమా ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ పంచుతుంది. ఇదే నిడివితో జనవరి 29 లేదా జనవరి 31 నుంచి ‘పుష్ప 2‘ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రాబోతుందనే ప్రచారం జరుగుతుంది.

Tags

Next Story