సంధ్య థియేటర్లో ‘పుష్ప 2‘ అరుదైన రికార్డు!

సంధ్య థియేటర్లో ‘పుష్ప 2‘ అరుదైన రికార్డు!
X
హైదరాబాద్ సంధ్య థియేటర్లో ‘పుష్ప 2‘ కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. సంధ్య 70 ఎమ్.ఎమ్. థియేటర్లో 206 షోలకు గానూ ‘పుష్ప 2‘ 1 కోటి 89 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2‘ మాస్ ర్యాంపేజ్ కొనసాగుతూనే ఉంది. విడుదలై 50 రోజులు దాటినా ఇంకా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం కొనసాగిస్తూనే ఉంది. ఇటీవలే ఈ సినిమాకి మరో 20 నిమిషాలు అదనంగా కలపడంతో రిపీట్ ఆడియన్స్ పెరిగారు. కొత్త సీన్స్ ను తిలకించేందుకు ఫ్యాన్స్ మళ్లీ థియేటర్లకు పోటెత్తారు.

మల్టీఫ్లెక్స్ లకు మించిన రీతిలో సింగిల్ స్క్రీన్స్ లో ‘పుష్ప 2‘ కలెక్షన్ల ర్యాంపేజ్ కొనసాగుతుంది. లేటెస్ట్ గా హైదరాబాద్ సంధ్య థియేటర్లో ‘పుష్ప 2‘ కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. సంధ్య 70 ఎమ్.ఎమ్. థియేటర్లో 206 షోలకు గానూ ‘పుష్ప 2‘ 1 కోటి 89 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. 51 రోజులకు గానూ ఈ వసూళ్లు సాధించింది ఈ సినిమా. ఇంకా ‘పుష్ప 2‘ థియేట్రికల్ రన్ కొనసాగుతూనే ఉంది.

మరోవైపు ‘పుష్ప 2‘ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే థియేటర్లో ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లు సాధించడం ఓ రికార్డుగా చెబుతోంది టీమ్. అందుకు సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.

Tags

Next Story