పూరి సేతుపతి మూవీ ప్రారంభం

పూరి సేతుపతి మూవీ ప్రారంభం
X
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబోలో రూపొందుతున్న చిత్రం ముహూర్తాన్ని జరుపుకుంది.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబోలో రూపొందుతున్న చిత్రం ముహూర్తాన్ని జరుపుకుంది. ‘పూరి సేతుపతి‘ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఓపెనింగ్ సెరమనీలో హీరోహీరోయిన్లు విజయ్ సేతుపతి, సంయుక్త మీనన్ కూడా పాల్గొన్నారు. ఈరోజు నుంచి ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలు పెట్టుకుంది.

ఈ లాంగ్ షెడ్యూల్ లో విజయ్ సేతుపతి, సంయుక్త మీనన్, టబు, దునియా విజయ్ లపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నాడట డైరెక్టర్ పూరి జగన్నాథ్. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఓ బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నాడట. పూరి జగన్నాథ్ తన మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఈ సినిమాలో ఓ సందేశాన్ని అందించనున్నాడట.

Tags

Next Story