రామ్ గాత్రంలో 'పప్పీ షేమ్'

ఉస్తాద్ రామ్ హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆంధ్రా కింగ్ తాలూకా'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నాడు. రావు రమేష్, మురలి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీవీటీ గణేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాలో రామ్ కొత్త లుక్ లో సందడి చేయబోతున్నాడు. కాలేజ్ స్టూడెంట్ గా క్యూట్ బాయ్ గా సందడి చేయబోతున్నాడు ఎనర్జిటిక్ స్టార్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ 'పప్పీ షేమ్' రాబోతుంది.
అందుకు సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో రామ్ కాలేజ్ స్టూడెంట్ లుక్‌లో ఎనర్జిటిక్‌గా ఆకట్టుకుంటున్నాడు. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ రాయగా, రామ్ స్వయంగా పాడటం విశేషం. వివేక్-మెర్విన్ సంగీతం అందించిన ఈ ఫుల్ సాంగ్ సెప్టెంబర్ 8న విడుదల కానుంది.
మరోవైపు నవంబర్ 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతుంది 'ఆంధ్రా కింగ్ తాలూకా'. ఒక హీరో, అతని ఫ్యాన్ కు మధ్య జరిగే ఆసక్తికరమైన కథాంశంగా 'ఆంధ్రా కింగ్ తాలూకా' రాబోతుంది. ఈ చిత్రంలో ఆ డై హార్డ్ ఫ్యాన్ గా రామ్ కనిపించనుండగా.. హీరో పాత్రలో ఉపేంద్ర కనిపించనున్నాడు.
-
Home
-
Menu