‘థగ్ లైఫ్‘కు నిరసన సెగ

‘థగ్ లైఫ్‘కు నిరసన సెగ
X
కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ చిత్రం కర్ణాటకలో విడుదలపై వివాదం చెలరేగింది. ఇటీవల చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తమిళం నుంచే కన్నడ పుట్టిందన్న కమల్ వ్యాఖ్యలు రాజకీయ పార్టీలతో పాటు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి.

కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ చిత్రం కర్ణాటకలో విడుదలపై వివాదం చెలరేగింది. ఇటీవల చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తమిళం నుంచే కన్నడ పుట్టిందన్న కమల్ వ్యాఖ్యలు రాజకీయ పార్టీలతో పాటు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి.

కానీ కమల్ హాసన్ ‘తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతాను, ప్రేమతో మాట్లాడాను‘ అంటూ వెనక్కి తగ్గలేదు. దీంతో ఈ వివాదం మరింత ముదురుతుంది. కర్ణాటకలో ‘థగ్ లైఫ్‘ను ఆపాలంటూ నిరసనల సెగ జోరుగా కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో ‘థగ్ లైఫ్’ విడుదలకు అడ్డంకులు రాకుండా చూడాలని కోరుతూ కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ తరఫున కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ, ఫిల్మ్ ఛాంబర్ సహా పలు విభాగాలను ప్రతివాదులుగా చేర్చి, సినిమా ప్రదర్శనకు తగిన భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. జూన్ 5న దేశవ్యాప్తంగా ‘థగ్ లైఫ్’ విడుదలకు సన్నాహాలు సాగుతున్నా, కర్ణాటకలో మాత్రం విడుదలపై స్పష్టత లేదు. దాదాపు 37 ఏళ్ల తర్వాత కమల్ హాసన్ – మణిరత్నం కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Tags

Next Story