కందుల దుర్గేష్ తో నిర్మాతలు భేటీ

తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో ప్రముఖ తెలుగు సినిమా నిర్మాతలు భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో ప్రధానంగా సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్‌పై జరుగుతున్న సమ్మె అంశం ప్రాధాన్యత పొందింది. గత కొన్ని రోజులుగా కార్మికులు 30% వరకు వేతన పెంపు కోరుతూ సమ్మె కొనసాగిస్తున్నారు. కొంతమంది నిర్మాతలు కార్మికుల డిమాండ్ లోని కొంత భాగాన్ని అంగీకరించినప్పటికీ, ఇంకా మొత్తం సమస్యకు పరిష్కారం రాలేదు. ఈ నేపథ్యంలో, కార్మిక సంఘాల ఆందోళనతో షూటింగ్‌లకు అంతరాయం కలుగుతున్న పరిస్థితిని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
పరిశ్రమలోని ఇతర సమస్యలు, నిర్మాణ వ్యయాల పెరుగుదల, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో మార్పులు వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ భేటీలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, డి.వి.వి. దానయ్య, కె.ఎల్. నారాయణ, భరత్ (ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు), నాగ వంశీ, వై. రవిశంకర్, విశ్వ ప్రసాద్, బన్నీ వాసు, వంశీ (UV Creations), చెర్రీ (Mythri Movies), వివేక్ కూచిభొట్ల, సాహు గారపాటి పాల్గొన్నారు.
-
Home
-
Menu