ప్రియదర్శి కొత్త సినిమా ప్రకటన!

ప్రియదర్శి కొత్త సినిమా ప్రకటన!
X
కమెడియన్ గా మొదలైనా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రియదర్శి.

కమెడియన్ గా మొదలైనా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రియదర్శి. 'కోర్ట్' మూవీతో తన కెరీర్ లోనే ఘన విజయాన్ని అందుకున్నాడు. లేటెస్ట్ గా 'ప్రేమంటే' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ప్రియదర్శికి జోడీగా ఆనంది నటిస్తుంది. 'థ్రిల్‌ యు ప్రాప్తిరస్తు' అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్.

నవనీత్‌ శ్రీరామ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, పుస్కూర్ రామ్‌మోహన్ రావు, జాన్వి నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యాంకర్ సుమ కూడా కీలక పాత్రలో కనిపించబోతుంది. లేటెస్ట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు. ఈ చిత్రం ఇప్పటికే 65% చిత్రీకరణ పూర్తి చేసుకుంది.



Tags

Next Story