'జైలర్ 2' షూటింగ్ కోసం సన్నాహాలు!

జైలర్ 2 షూటింగ్ కోసం సన్నాహాలు!
X
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో 'జైలర్' సినిమాది ప్రత్యేక స్థానం. 'జైలర్'తోనే సూపర్ స్టార్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో రజనీకాంత్ మాస్ ఎలివేషన్స్ కు మంచి పేరొచ్చింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో 'జైలర్' సినిమాది ప్రత్యేక స్థానం. 'జైలర్'తోనే సూపర్ స్టార్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో రజనీకాంత్ మాస్ ఎలివేషన్స్ కు మంచి పేరొచ్చింది. అనిరుధ్ సంగీతం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్. ఇప్పుడు 'జైలర్'కి సీక్వెల్ గా 'జైలర్ 2' రూపొందుతుంది. ఇటీవలే 'జైలర్ 2' అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేసింది టీమ్. ఆ వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది.

లేటెస్ట్ గా 'జైలర్ 2' షూటింగ్ మొదలు పెట్టుకోవడానికి సిద్ధమవుతుందట. మార్చి ప్రథమార్థంలో ఈ సినిమా షూటింగ్ షురూ కానుందట. ఓ పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ షూట్ ను మొదలు పెట్టనున్నట్టు కోలీవుడ్ టాక్. ఇక మొదటి భాగాన్ని మించే స్థాయిలో రజనీకాంత్‌ను మరింత స్టైలిష్‌గా చూపించేందుకు దర్శకుడు నెల్సన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి నటీనటుల విషయానికి వస్తే, ‘జైలర్’లో కీలక పాత్రలు పోషించిన రమ్యకృష్ణ, యోగిబాబు తదితరులు ‘జైలర్ 2’లోనూ కనిపించనున్నారు. ‘జైలర్’ను నిర్మించిన సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సీక్వెల్‌ను కూడా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మరోవైపు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న 'కూలీ' సినిమా చివరిదశకు చేరుకుంది.

Tags

Next Story